మీ రిపోర్ట్‌ను మీరు ముగించిన తర్వాత మీకు "రిపోర్ట్ కీ" అని పిలువబడే ప్రత్యేకమైన కోడ్ కేటాయించబడుతుంది. మీ రిపోర్ట్ కీని మరియు పాస్‌వర్డ్‌ను రాయండి మరియు వాటిని సురక్షిత స్థలంలో ఉంచండి, ఎందుకంటే దాన్ని మీరు పోగొట్టుకున్నట్లయితే మీకోసం NAVEX దాన్ని తిరిగి పొందలేదు. 5-6 పని దినాల తర్వాత, ఫీడ్‌బ్యాక్ లేదా ప్రశ్నల కోసం మీ రిపోర్ట్‌ను తనిఖీ చేయడానికి మీ రిపోర్ట్ కీని మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి.
నిజాయితీ, విలువలు, పారదర్శకత- ఓ కంపెనీ వాటిని తమ వ్యాపారం నిర్వహణలో భాగం చేసుకోనంత వరకు అవి ఒట్టి పదాలు మాత్రమే. కాని, యూనివర్సల్ లో ఆ నిబద్ధత ప్రతీ రోజూ, ప్రతీ దశలోనూ అంతర్లీనమై ఉంటుంది. ప్రమాద నివారణ చర్యల్లోనే కాదు, చట్టాలు, నిబంధనలు అనుసరణ అనేది మా డీఎన్ఎలో నిబిడీకృతమై ఉంది. అది మేము తీసుకొనే ప్రమాద నివారణ చర్యలు, నైతికతతో కూడిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో, కార్పొరేట్ పరిపాలన విధానాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సరైన పనిని సరైన మార్గంలో చేయడమే వ్యాపారానికి ఏకైక దారనే సిద్ధాంతాన్ని యూనివర్సల్ మేనేజ్ మెంట్ గట్టిగా విశ్వసిస్తుంది. అదే మా నాయకులు ఆచరిస్తారు.
పరిశ్రమలో సమున్నత స్థానాన్ని కాపాడుకోవాలంటే మేము మా వ్యాపారాన్ని నిజాయితీతో నిర్వర్తించడం చాలా ముఖ్యం. మేము మా కొనుగోలుదారులు, మా కమ్యూనిటీలు, మా వాటాదారులు ప్రతీ ఒక్కరికి మేము రుణపడి ఉంటాం. మనంలో ప్రతీ ఒక్కరికి పోషించేందుకు ఓ ముఖ్య పాత్ర ఉంటుంది, దాన్ని యూనివర్సల్ కచ్చితంగా లెక్కలోకి తీసుకుంటుంది.
మాకు మార్గనిర్దేశం చేసేందుకు మా ప్రవర్తనా నియమావళి అత్యున్నత నైతిక ప్రమాణాలు నిర్దేశించింది. ఆ ఉన్నత ప్రమాణాలకు తగ్గట్టుగా వ్యాపారం చేయడం సరైన చర్య అవడమే కాదు అది మంచి వ్యాపారం కూడా. నైతికత, నిజాయితీకి సంబంధించి, యూనివర్సల్ కు మూడు ప్రాథమిక లక్ష్యాలున్నాయి: 1) నిజాయితీతో పనిచేయడం; 2) నిజాయితీతో వ్యాపారం నిర్వర్తించడం; 3) సమాచారాన్ని, ఆస్తులను నిజాయితీగా నిర్వహించడం. ఈ లక్ష్యాలను మనం చేరుకోగలిగితే యూనివర్సల్ మనం అది చేరుకోవాల్సిన స్థానానికి చేర్చినవారమవుతాం.
ఏదైనా ఉల్లంఘన జరిగితే దాన్ని వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అట్టి ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని దాన్ని చక్కదిద్దే ప్రయత్నంతో పాటు సరైన చర్యలు తీసుకునేందుకు యూనివర్సల్ కు అవకాశముంటుంది.
యూనివర్సల్ విధానాలు లేదా చట్ట ఉల్లంఘనకు సంబంధించి నిజమైన సమాచారమిచ్చిన వారిపై యూనివర్సల్ సంస్థలోని ఎవరూ కూడా ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోరు. సదుద్దేశంతో ఉల్లంఘనలకు సంబంధించి సమాచారమిచ్చిన వ్యక్తులను ప్రశ్నించడం లేదా వారిపై ప్రతీకార చర్యలకు దిగడమన్నది యూనివర్సల్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదు. ప్రతీకార చర్యలకు దిగినా లేదా అలాంటి ప్రయత్నం చేసిన వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.
మీ స్థానిక భాషలో వారంలో 7 రోజులు 24 గంటల పాటు పనిచేసే హాట్ లైన్ అందుబాటులో ఉంది. ఫోన్ కాల్స్, ఆన్ లైన్ నివేదికలను స్వతంత్ర సంస్థ ఎథిక్స్ పాయింట్ అందుకుటుంది. అనైతిక లేదా అక్రమ కార్యకలాపాలను నిజాయితీగా వెల్లడించేందుకు మీ పేరు, గోప్యత కాపాడేందుకు తగిన భద్రత కల్పించడం దీని ఉద్దేశం.
ప్రతీ నివేదికను పరిశీలించడం జరుగుతుంది. ఫాలో అప్ చేసి దాన్ని కార్పొరేట్ కంప్లాయన్స్ కమిటీకి నివేదించడం జరుగుతుంది. మేము మా హాట్ లైన్ ను చాలా తీవ్రంగా తీసుకుంటాం, మీరు అలాగే చేయాలని కోరుకుంటున్నాం. మీరు దేన్నైనా గమనిస్తే వెంటనే మాకు తెలియజేయండి, కలిసికట్టుగా దానికి అడ్డుకట్ట వేద్దాం.